హైదరాబాద్: 28°C
క్రీడలు

మా ఓటమికి ప్రధాన కారణం ఇదే: షాయ్ హోప్

లక్నో వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమిపై విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ స్పందించాడు. ఆఖర్లో తగినన్ని పరుగులు చేయలేకపోయామన్నాడు. భారత్‌లో భారీ స్కోరు ఉంటేనే బౌలర్లకు రక్షణ ఉంటుందని తెలిపాడు. తమ జట్టులో స్పిన్నర్ల కొరత కారణంగా బౌలింగ్ ప్రణాళికలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ, భారత్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి విజయం సాధించిందని అతడు కొనియాడాడు.