కడప: శివారులోని అలంకానపల్లె సర్కిల్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి సర్కిల్ వైపు టమోటా లోడుతో వెళ్తున్న మినీ ట్రక్ టైర్ ఒక్కసారిగా పగలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో టమోటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు క్రేన్ సాయంతో ట్రక్కును పైకి లేపారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టైర్ పగిలి మినీ ట్రక్ బోల్తా..!


