హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచాలి'

W.G: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలను పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం తణుకులో ఆశా, అంగన్వాడీ కార్య కర్తలు ర్యాలీ నిర్వహించారు.