హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 9న అండర్-19 క్రికెట్ ఎంపిక పోటీలు

ఆసిఫాబాద్ ,మంచిర్యాల జిల్లాల అండర్-19 బాలబాలికల క్రికెట్ ఎంపిక పోటీలు ఈనెల 9న జరగనున్నాయి. అర్హత కలిగిన విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో బెల్లంపల్లి మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీలో మధ్యాహ్నం 12 గంటలకు రిపోర్ట్ చేయాలని ఉమ్మడి జిల్లా SGF కార్యదర్శి బాబురావు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఉమ్మడి ఆదిలాబాద్ జోన్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు.