హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం

NLG: నల్గొండ మండలం చెట్లచెన్నారం గ్రామానికి చెందిన బోయినపల్లి కమలమ్మ (50) అవయవదానంతో ఐదుగురికి కొత్త జీవితం లభించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను అక్టోబర్ 5న వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కళ్లను దానం చేశారు.