కృష్ణా: పెనమలూరులో పింఛన్ కోసం భర్త చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ పొందిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కానూరుకు చెందిన రమాదేవి.. భర్త మురళీకృష్ణతో 15 ఏళ్లుగా విడిగా ఉంటోంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆంటోనీకి రూ. 15 వేల ఇచ్చి నకిలీ శ్మశాన ధ్రువీకరణ పత్రం తీసుకుని, డెత్ సర్టిఫికెట్ పొందింది. భర్త సజీవంగా ఉన్నట్లు తేలడంతో అధికారులు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
బతికుండగానే డెత్ సర్టిఫికెట్..!


