హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకు ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి

NZB: దసరా సెలవుల్లో ఊరికి వెళ్లే ప్రజలు ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని CP సాయి చైతన్య సూచించారు. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని,అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం అందించాలన్నారు.