హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అటవీశాఖ రేంజ్ అధికారిగా రవికుమార్ బాధ్యతలు

ASR: గూడెం కొత్తవీధి మండలం సీలేరు అటవీశాఖ రేంజ్ అధికారిగా జి రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రేంజ్ అధికారిగా పనిచేసిన వెంకటరావు నర్సీపట్నం బదిలీ అయ్యారు. మన్యం జిల్లా పార్వతీపురం రేంజ్ అధికారిగా పనిచేస్తున్న రవికుమార్‌ను సీలేరు రేంజ్‌కు నియమించారు. డీఆర్వో రమణమ్మ సెక్షన్ అధికారి సతీష్ తదితరులు అభినందనలు తెలిపారు.