హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

8న పర్చూరులో హోం మంత్రి పర్యటన

BPT: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి ఈ నెల 8న పర్చూరు, మార్టూరు మండలాల్లో పర్యటించనున్నారు. మొత్తం రూ.17.98కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో సీసీ రోడ్లు, జలజీవన్ మిషన్, అగ్నిమాపక కేంద్రం శంకుస్థాపనలతో పాటు రూ.3 కోట్ల శ్రీనిధి రుణాలు, రూ.67లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఉన్నాయి.