హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చెరుకుమిల్లిలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన

కృష్ణా: కృత్తివెన్ను మండలం చెరుకుమిల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం రూ. 82 లక్షల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టిందని అన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకల ఇబ్బందులు తగ్గడంతో పాటు సమీప గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.