కడప: అమీన్‌పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దర్గా పెద్దలు ఆహ్వానించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబును దర్గా పీఠాధిపతి కేఎస్ఎస్ ఆరీఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు జరిగే ఉరుసు ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అమీన్‌పీర్ దర్గా ఉరుసుకు సీఎంకు ఆహ్వానం


