NTR: బీసెంట్ రోడ్డులో మంగళవారం సాయంత్రం ట్రాఫిక్, డ్రగ్స్‌పై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్‌పేట ఎస్సై రేవతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలను తాగడం, విక్రయించడం చట్టవిరుద్ధమని తెలిపారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం


