KMM: బూర్గంపహాడ్ ప్రధాన రహదారిపైకి మంగళవారం మొసలి పిల్ల రావడంతో స్థానిక యువత అప్రమత్తమై దాన్ని పట్టుకున్నారు. వాహనాల కింద పడి ప్రమాదం జరగకుండా కాపాడి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. సారపాక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డి.కృష్ణ ఆధ్వర్యంలో అధికారులు మొసలి పిల్లను స్వాధీనం చేసుకుని గోదావరిలో వదిలారు. ఈ సందర్భంగా యువతను అటవీ శాఖ అధికారులు అభినందించారు.
తెలంగాణ
రోడ్డుపైకి మొసలి పిల్ల


