హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానం

KMR: నాగిరెడ్డిపేట మండలం తాండూరులో సర్పంచ్ భూమా యాదాగౌడ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీకి ఇప్పటివరకు వచ్చిన ఆదాయ, వ్యయ వివరాలను గ్రామస్థులకు వివరించారు. వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రాబోయే రోజుల్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు.