ADB: ఆదిలాబాద్‌లో డీఆర్‌డీఏలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.47,000 మోసం చేసిన షేక్ ఫరూఖ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు మంగళవారం తెలిపారు. బాధితుడు అభిలాష్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిని నమ్మి మోసపోవద్దని నాగరాజు హెచ్చరించారు.
తెలంగాణ
జాబ్ ఫ్రాడ్ కేసులో నిందితుడు అరెస్ట్, రిమాండ్: CI


