హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధురాలుపై బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్

ADB: మావల పరిధిలోని కేఆర్‌కే కాలనీలో 75 ఏళ్ల గంగాదేవికి కేటాయించిన స్థలంలో షారుఖ్‌ ఖాన్ అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు CI ప్రేమ్ కుమార్ మంగళవారం తెలిపారు. దీనిని ప్రశ్నించిన వృద్ధురాలిని నిందితుడు అసభ్యంగా దూషించి, హత్య చేస్తానని బెదిరించినట్లు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.