హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు గీ కారం దోశకు ప్రత్యేక క్రేజ్

నెల్లూరు గీ కారం దోశకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ లభిస్తోంది. దోశపై నెయ్యి, కారం, ఉల్లిపాయ, ప్రత్యేక మసాలా మిశ్రమంతో తయారు చేసే ఈ వంటకం రుచిలో ప్రత్యేకతను సంతరించుకుంది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు సైతం దీనిని రుచి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ధరలో కడుపునిండే టిఫిన్‌గా ఇది హోటళ్లలోనూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా?.