ELR: ద్వారకాతిరుమల అన్నదాన శిబిరంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి స్వయంగా అన్నం తినిపించిన సిబ్బంది గాయత్రిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ నెల 3న జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో సీఎం 'X' వేదికగా స్పందించారు. శభాష్ గాయత్రీ.. ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు, 'మానవ సేవే మాధవ సేవ' అంటూ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
శభాష్ గాయత్రీ.. సిబ్బంది గొప్ప మనసుకు సీఎం ఫిదా!


