హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు ఆశా వర్కర్ల వినతి

BPT: ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (CITU) రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సెలవులు, టీఏలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్, నాణ్యమైన ఫోన్లు అందించాలని కోరారు.