KDP: ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకల నేపథ్యంలో సిబ్బంది సమావేశం నిర్వహించారు. సీఐ టి.వి. కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతలపై సిబ్బందికి సూచనలు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
దసరా వేడుకలపై పోలీసుల సమావేశం


