హైదరాబాద్: 28°C
క్రీడలు

డెబ్యూ మ్యాచ్‌లో అదరగొట్టిన నమన్ ధీర్

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో అరంగేట్రం ఆటగాడు నమన్ ధీర్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా హాఫ్ సెంచరీ చేసిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ సహా రొమారియో షెపర్డ్, షామర్ స్ప్రింగర్ వికెట్లు తీశాడు. అయితే ఈ ముగ్గురు బ్యాటర్లు కూడా నమన్ ధీర్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన తర్వాతి బంతికే ఔట్ కావడం విశేషం.