PPM: అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.పి.విజయలక్ష్మి తెలిపారు. చినబొండపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన NIDDCP సర్వేను ఆమె పరిశీలించారు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు అభివృద్ధి,నేర్చుకునే సామర్థ్యానికి అయోడిన్ అవసరమన్నారు. ఆహారంలో అయోడైజ్డ్ ఉప్పునే వినియోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అయోడైజ్డ్ ఉప్పునే వినియోగించాలి'


