హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక గ్రామాల్లో పల్లె నిద్రలు చేయాలి: ఎస్పీ

KRNL: కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు పరిశీలించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక గ్రామాల పరిస్థితుల పై కర్నూలు తాలూకా సీఐ తేజ మూర్తిని అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక గ్రామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.