హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీధి కుక్కల స్వైరవిహారం

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని గాంధీనగర్, కందర్ప కాలనీల్లో కుక్కల స్వైరవిహారంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ వాహనదారులు, పాదచారులపై కుక్కలు విరుచుకుపడుతున్నాయని వారు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల సమస్యకు తగిన పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.