NGKL: బల్మూరు మండల కేంద్రానికి చెందిన పాల పద్మమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడంతో మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం రూ.5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసింది. ఈ మేరకు చెక్కును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మంగళవారం లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత


