కోనసీమ: పాశర్లపూడి జంక్షన్‌లో అక్రమంగా పార్కింగ్ చేసిన రెండు లారీలు, ఒక బస్సుపై రవాణాశాఖ కేసులు నమోదు చేసి రూ. 9 వేల జరిమానా విధించింది. 216 జాతీయ రహదారిపై అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రమాదాల ముప్పు ఉన్నందున తనిఖీలు ముమ్మరం చేసినట్లు డీటీఓ తెలిపారు. గత నెలలో 41 వాహనాలపై కేసులు నమోదు చేసి, రూ.1.19 లక్షల అపరాధ రుసుము వసూలు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
41 వాహనాలపై కేసులు నమోదు


