హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

అన్నమయ్య: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, మౌలిక వసతుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, సాగునీరు, విద్యా, వైద్య రంగాల పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పనుల్లో జాప్యాన్ని సహించబోమని, శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.