హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి

AKP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు అధికారులు, పండితులు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.