హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు సేవా జ్యోతి యాత్ర

SKLM: ప్రధాని మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో సేవా జ్యోతి యాత్ర నిర్వహించనున్నారు. ముందుగా మోదీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం వీక్షించి, అనంతరం ర్యాలీ చేపడతారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు కోరారు.