హైదరాబాద్: 28°C
వార్తలు

గోదావరిఖనిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

PDPL: గోదావరిఖని పట్టణంలో 33KV లైన్‌కు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నందున బుధవారం విద్యుత్ కోత ఉంటుందని ADE గుండు శ్రీనివాస్ తెలిపారు. రాం మందిర్ సబ్ స్టేషన్ పరిధిలోని రాంనగర్, గాంధీనగర్, విఠల్ నగర్, ఫైవ్ ఇంక్లైన్, జవహర్ నగర్, LB నగర్, లక్ష్మీ నగర్ ఏరియాల్లో ఉ. 9.30 నుంచి 11.30 గంటల వరకు కరెంటు ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.