హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలు, బాలికల భద్రతపై విద్యార్థులకు అవగాహన

కాకినాడ వెంకటనగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాలలో మహిళలు, బాలికల భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ మోసాలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై బి. ఏలీయా విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో 112, సైబర్ నేరాలకు 1930, బాలల సహాయానికి 1098, మహిళల సహాయానికి 181 నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.