KMR: నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూరు గ్రామ ప్రైమరీ స్కూల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక ఎంపీడీవో గంగాధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాలని తెలిపారు.
తెలంగాణ
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో


