హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్‌ షాపుల్లో అధికారుల తనిఖీలు

W.G: తణుకులోని వెంకటేశ్వర ఆర్థోపెడిక్ డిస్పెన్సరీతోపాటు సాయి ఆసుపత్రిలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. తణుకు, భీమవరం డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌లు మల్లికార్జునరావు, అబిద్ ఆలీ తనిఖీలు చేపట్టారు. ఫార్మసిస్ట్ లేకుండా మందుల విక్రయాలు, కాలం చెల్లిన మందులు, హెచ్‌-1 రిజిస్ట్రేషన్ లేకపోవడం, బిల్లులు లేకుండా విక్రయాలు గుర్తించినట్లు తెలిపారు.