హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ తైక్వాండోలో జూపూడి విద్యార్థిని సత్తా

NTR: ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామానికి చెందిన విద్యార్థిని కలతోటి దామిని జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన పోటీల్లో అండర్-17, 55-59 కేజీల బాలికల విభాగం క్యూరుగిలో దామిని ప్రతిభ కనబరిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది.