NZB: సెలవుల్లో ఊరికి వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ సాయి చైతన్య సూచించారు. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని, పొరుగువారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112కు సమాచారం అందించాలని సూచించారు.
తెలంగాణ
దసరాకు ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి: కమిషనర్


