హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని నరవ బయనపల్లె గ్రామంలో మంగళవారం హజరత్ దస్తగిరి స్వాముల వారి ఉరుసు మహోత్సవంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఉరుసు మహోత్సవానికి హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, స్థానికులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.