హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో ఇంటి రిజిస్ట్రేషన్?

KMR: కామారెడ్డిలో నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారం కలకలం రేపుతోంది. బతికున్న హసీనా బేగం చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రం సృష్టించి, ఆమె పేరుపై ఉన్న 100 గజాల ఇంటిని సయ్యద్ అలీ పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.