WNP: జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్లను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని ఫోన్ కాల్స్ మెసేజ్లు, అనుమానాస్పద ఆఫర్లకు స్పందించవద్దన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్లు ఆవిష్కరణ'


