హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవాలకు తమిళనాడు సీఎంకు ఆహ్వానం

NTR: విజయవాడలో ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా ఉత్సవాలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఎంపీలు కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు ఆహ్వానించారు. విజయవాడలో నిర్వహించనున్న ‘ఉత్సవ్ 2.0’ కార్యక్రమానికి కూడా హాజరుకావాలని కోరారు. దసరా ఉత్సవాల ప్రత్యేకతలు, కార్యక్రమాల వివరాలను సీఎంకు వివరించి మంగళవారం ఆహ్వాన పత్రిక అందజేశారు.