హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన: ఆర్డిఓ

KMR: బాన్సువాడ ఆర్డీఓ రవీందర్రెడ్డి మంగళవారం మద్నూర్ మండల కేంద్రంతో పాటు కొడిచీర గ్రామంలో దేవాదాయ, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా భూములకు సంబంధించిన రికార్డులు, హద్దులు, ఆక్రమణల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.