హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విదేశీయుల బస వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి'

KRNL: జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ఆసుపత్రులు, హాస్టళ్లు, ఇళ్ల యజమానులు వారి బస వివరాలను 24 గంటల్లోగా ఫారం-సీ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. మంగళవారం నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత యజమానులపై క్రిమినల్‌ కేసులతోపాటు జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.