హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల మెడకు రిజిస్ట్రేషన్ ఉచ్చు!

JGL: రిజిస్ట్రేషన్లతో కాంగ్రెస్ సర్కార్ రైతుల మెడకు ఉచ్చు బిగిస్తోంది అని మాజీ జడ్పీ చైర్‌పర్సన్ వసంత అన్నారు. మంగళవారం బీర్పూర్‌లో ఆమె మాట్లాడుతూ.. "గతంలో కేసీఆర్ ఖాతాలో డబ్బులేస్తే, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫారం ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు" అని విమర్శించారు. రోళ్లవాగు ప్రాజెక్టుకు వెంటనే గేట్లు బిగించాలని డిమాండ్ చేశారు.