హైదరాబాద్: 28°C
తెలంగాణ

కనీస ఆటో ఛార్జీ రూ.70కి పెంచాలని ఎమ్మెల్యేకు వినతి

జగిత్యాల పట్టణంలో ఆటో కనీస ఛార్జీని రూ.50 నుంచి రూ.70కి పెంచాలని కోరుతూ ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. చింత సుధీర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న వారు పెట్రోల్, డీజిల్, గ్యాస్, విడిభాగాల ధరలు పెరగడంతో ప్రస్తుత ఛార్జీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.