హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజన సమస్యలపై తీర్మానాలు చేయాలి'

PPM: ఈ నెల 8న జరగనున్న పార్వతీపురం ITDA జనరల్ బాడీ సమావేశంలో గిరిజనుల ఉద్యోగ, ఉపాధి, మౌలిక వసతుల సమస్యలపై కీలక తీర్మానాలు చేయాలని ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి జిల్లా జాయింట్ సెక్రటరీ దుక్కా సీతారాం డిమాండ్ చేశారు. గిరిజనులకు ప్రత్యేక DSC ప్రకటించాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ANM పోస్టులను భర్తీ చెయ్యాలన్నారు.