హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర టూరిజం పెట్టుబడులపై మంత్రి దుర్గేష్ దృష్టి

E.G: అక్టోబర్ 6 నుంచి 8 వరకు స్పెయిన్‌లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పర్యటించనున్నారు. సెవిల్లె-ఫిబెస్‌లో జరిగే టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026లో పాల్గొని, ఏపీ పర్యాటక వనరులు, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి వివరించనున్నారు. పర్యాటక రంగంలో నూతన సాంకేతికత, స్మార్ట్ డెస్టినేషన్స్, సుస్థిర అభివృద్ధి అంశాలపై జరిగే చర్చల్లో మంత్రి పాల్గొననున్నారు.