హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంకలదొడ్డిలో ఆరోగ్య మందిరం ప్రారంభం

CTR: కుప్పం మండలం మంకలదొడ్డి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్సీ శ్రీకాంత్ పేర్కొన్నారు.