NLG: మిర్యాలగూడ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన జరిగింది. జప్తి వీరప్పగూడెంలోని సర్వే నంబర్ 214లో 20–25 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. ఒకే ప్రాంగణంలో 2,500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ
మిర్యాలగూడలో యంగ్ ఇండియా స్కూల్‌కు స్థల పరిశీలన


