హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల పోరాటానికి సీఐటీయూ మద్దతు

ASR: వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందర్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం పాడేరు జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్యోగుల నిరసనకు హాజరై మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు 100 శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని కోరారు.