హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమృత్‌నగర్‌లో డంపింగ్‌పై స్థానికుల నిరసన

KDP: ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన అనంతరం అమృత్‌నగర్‌లో చెత్త డంపింగ్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను తరలించి కాల్చడం వల్ల పొగతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అమృత్‌నగర్‌ను డంపింగ్ యార్డుగా మార్చవద్దని కోరుతూ టెంట్ వేసి నిరసన చేపట్టారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.