E.G: రాజమండ్రిలో ట్రీ కటింగ్, విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. మెయిన్ రోడ్, ఉల్లితోట వీధి, టి.నగర్, గోదావరి బండ్, సాయికృష్ణ థియేటర్, గుండువారి వీధి, వంకాయలవారి వీధి, చందా సత్రం వీధుల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్


